You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
యుక్రెయిన్‌కు ఆయుధాలు పంపించడం ఆమోదనీయం కాదంటూ అమెరికాకు రష్యా హెచ్చరిక
‘యుక్రెయిన్‌కు ఆయుధాలను పంపించడం ఆమోదయోగ్యం కాదని మేం అమెరికాకు గట్టిగా చెప్పాం. ఈ తీరును మార్చుకోవాలని డిమాండ్ చేశాం’’ అని రోసియా 24 టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాషింగ్టన్‌లోని రష్యా రాయబారి అనటోలీ ఆంటోనోవ్ చెప్పారు.
లైవ్ కవరేజీ
రాజేశ్ పెదగాడి
పబ్లిక్ ఎగ్జామినేషన్స్(ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం
ప్రశ్నపత్రాల లీకేజ్‌లను నివారించడానికి, పబ్లిక్ ఎగ్జామినేషన్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్, 2024కు సవరణలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇవాళ లోక్‌సభలో ఒక బిల్లును ప్రవేశపెట్టనుంది.
కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు.
ప్రశ్నాపత్రాలను లీక్ కేసుల్లో దోషులు వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష, ఐదు నుంచి పది కోట్ల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. ఇలాంటి కేసుల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనుంది. పరీక్షకు అయిన ఖర్చును కూడా దోషుల నుంచి వసూలు చేస్తారు. వారిని ఎనిమిదేళ్లపాటు ఎలాంటి ప్రభుత్వ పరీక్షలు రాయకుండా నిషేధిస్తారు. గతంలో జరిమానా కోటిరూపాయలుగా ఉండేది. నిషేధం నాలుగేళ్లు ఉండేది.
ప్రతిపాదిత బిల్లు ప్రకారం పేపర్ లీకేజ్ కేసుల దర్యాప్తును సీబీఐ లేదా సిట్ రెండు నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఫ్రాన్స్‌లో కార్చిచ్చు, అధ్యక్షుడు మేక్రాన్ అత్యవసర సమావేశం
ఫ్రాన్స్‌లోని బోర్డో నగరానికి దగ్గరలో కార్చిచ్చు వ్యాపించింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పదివేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి వేలాదిమంది శ్రమిస్తున్నారు. 8,50,000మంది ఉండే నగరాన్ని ఖాళీ చేయించే అవకాశం అంతగా లేదని అధికారులు చెప్పారు. బోర్డోకు 15కిలోమీటర్ల దూరంలో మంటలు వ్యాపించాయి.
మరోవైపు ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమ్మానుయేల్ మేక్రాన్ అత్యవసర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు.
మంగళవారం నుంచి ఫ్రాన్స్‌లో ఉష్ణోగ్రతలు 40డిగ్రీల సెల్సియస్ వరకు పెరగొచ్చని వాతావరణశాఖ హెచ్చరించింది.
ఫ్రాన్స్‌లోని గిరోండ్ ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చు కారణంగా గతంలో ఎన్నడూ లేనంతగా పైరోక్యుములోనింబస్ అనే భారీ అగ్ని తుఫాన్ మేఘం ఏర్పడిందని నేషనల్ ఫైర్‌ఫైటర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఫ్రాన్స్(ఎఫ్ఎన్ఎస్‌పీఎఫ్) తెలిపింది.
కార్చిచ్చు ఫ్రాన్స్‌పై తీవ్ర ప్రబావం చూపింది. నైరుతి ఫ్రాన్స్‌లో 42వేల హెక్టార్లు కాలిపోయాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చెలరేగిన భారీ కార్చిచ్చుల్లో ఇదొకటి.
గత వారం నుంచి యూరప్‌లోని అనేక ప్రాంతాల్లో కార్చిచ్చులు వ్యాపిస్తున్నాయి.
కామన్‌వెల్త్ గేమ్స్: వరుసగా మూడోసారి స్వర్ణం గెలిచిన మీరాబాయి చనూ
ఫ్యాటీ లివర్ ఉన్నవారు మద్యం పూర్తిగా మానేయాలా? ఎన్నో ప్రశ్నలు - సమాధానాలు
‘చట్టబద్ధమైన పనులను కూడా నేరంగా మారుస్తున్నారు, నిరసన తెలిపితే జైలుకు పంపుతున్నారు’: సుప్రీం కోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలపై తీవ్ర చర్చ
'పాక్ పాలిత కశ్మీర్'లో చెలరేగిన హింసపై ఐక్యరాజ్యసమితి ఆందోళన, భారత్ వాదనేంటి, పాకిస్తాన్ ఏమంటోంది?
సీజేపీ: వీధి పోరాటం నుంచి విద్యాశాఖ మంత్రి రాజీనామా వరకు.. ఎప్పుడెప్పుడు, ఏం జరిగింది?
ఫ్రాన్స్, స్పెయిన్‌లో అడవులు, ఆవాసాలను కాల్చి బూడిద చేస్తున్న కార్చిచ్చు, 11 ఫోటోల్లో..
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారి తీసిన ఐదు కారణాలు ఇవేనా?
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా: ఇది మోదీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బా లేక ఒక పెద్ద అవకాశమా?
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యా శాఖ బాధ్యతలు
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యా శాఖ అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు.
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఆ శాఖ బాధ్యతలను జోషీకి అప్పగిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్రపతి డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రధాన మంత్రి మోదీ సూచనల మేరకు, విద్యా శాఖ అదనపు బాధ్యతలను ప్రహ్లాద్ జోషీకి అప్పగిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.
జోషి ప్రస్తుతం కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖల మంత్రిగా ఉన్నారు. ఆయన వద్దే పునరుత్పాదక ఇంధన శాఖ పోర్ట్‌ఫోలియో కూడా ఉంది.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ముర్ము అధికారికంగా ఆమోదించినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
సీజేపీ అన్ని డిమాండ్లకు ప్రభుత్వం సంపూర్ణంగా అంగీకరించిందా, బాధిత కుటుంబాలకు పరిహారం గురించి ఏం చెప్పారు?
'మనం అనుకున్నది సాధించాం' - అభిజీత్ దీప్కే
జంతర్ మంతర్ వద్ద యువత సంబరాలు, 9 ఫోటోల్లో...
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ప్రతిపక్షాలు ఏమన్నాయంటే..
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ప్రతిపక్ష నాయకులు స్వాగతించారు. ఇది యువత నేతృత్వంలో సాగిన ఉద్యమ విజయంగా అభివర్ణించారు.
ఇది "దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో మార్పులు చేయాలని కోరుతూ వీధుల్లోకి వచ్చిన మన లక్షలాది మంది యువత సాధించిన విజయం" అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.
ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ దీనిని, "దేశ యువత సమైక్య బలంతో సాధించిన ఒక భారీ విజయంగా అభివర్ణించారు. ఆయన ఎక్స్ పోస్టులో "అణచివేతకు భయపడకుండా అన్యాయానికి వ్యతిరేకంగా యువత బలంగా నిలబడి, ప్రభుత్వం నైతిక బాధ్యత వహించేలా చేసిన ఈ పోరాటం. ప్రజాస్వామ్య బలానికి నిదర్శనంగా నిలుస్తుంది" అని రాశారు.
ఇది "యువత సాధించిన పెద్ద విజయం" అని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. అయితే, భవిష్యత్తులో పేపర్ లీక్‌లను అరికట్టడానికి, పరీక్షా విధానాలను బలోపేతం చేయడానికి ఈ ఘటన అన్ని రాజకీయ పార్టీలకు ఒక పాఠంగా ఉపయోగపడాలని అభిలషించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా దీనిని "ప్రజాస్వామ్యానికి దక్కిన భారీ విజయం"గా అభివర్ణించారు.
ధర్మేంద్ర ప్రధాన్: ఒకప్పుడు పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా లాఠీ దెబ్బలు తిన్న వ్యక్తి.. ఇప్పుడు అదే వ్యవహారంలో రాజీనామా, విద్యార్థి నేత నుంచి కేంద్ర మంత్రి వరకు..
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, 'మనం సాధించాం' అన్న సీజేపీ
సోనమ్ వాంగ్‌చుక్: ‘బాధ, ఆవేదన, కోపంతో ఈ మాటలు మాట్లాడుతున్నా’
దిల్లీ నిరసనలు: పెల్లెట్ గన్ అంటే ఏంటి, ఎందుకు వివాదాస్పదంగా మారింది?