కామన్‌వెల్త్ గేమ్స్: వరుసగా మూడోసారి స్వర్ణం గెలిచిన మీరాబాయి చనూ

ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చనూ భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించింది.

కామన్వెల్త్ గేమ్స్‌లో మీరాబాయి వరుసగా మూడోసారి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.

మీరాబాయి చనూ వరుసగా రెండు సార్లు 2021,2022లో బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది.

మహిళల 48 కేజీల విభాగంలో మీరాబాయి అనేక రికార్డులను బద్దలు కొట్టింది.

స్నాచ్‌లో 85 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 105 కేజీలతో కలిపి మొత్తం 190 కేజీల బరువు ఎత్తింది.

మీరాబాయి చనూ కొత్త రికార్డులు

స్నాచ్‌లో 85 కేజీలు ఎత్తడం ద్వారా కామన్వెల్త్ గేమ్స్‌లో మీరాబాయి చనూ కొత్త రికార్డు సృష్టించింది.

కామన్‌వెల్త్ క్రీడల్లోవరుసగా మూడుసార్లు స్వర్ణం గెలవడంతో పాటు గతంలో ఆమె

రజత పతకం కూడా గెలుచుకుంది.

2014లో గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం గెలుచుకుంది. ఆ తర్వాత 2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం, తర్వాత 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో మరో స్వర్ణ పతకం సాధించింది.

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు రజత పతకం అందించి ఈ ఘనత సాధించిన తొలి భారతీయు వెయిట్ లిఫ్టర్‌గా చరిత్ర సృష్టించింది.

మూడు పతకాలు గెలుచుకున్న భారత్

గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ నాలుగో రోజున ఆదివారం(జూలై 26) భారత్ రెండో పతకాన్ని గెలుచుకుంది.

రిషికాంత్ సింగ్ చనమబమ్ పురుషుల 60 కిలోల వెయిట్‌లిఫ్టింగ్ ఫైనల్‌లో మొత్తం 264 కిలోల బరువును ఎత్తి రజత పతకాన్ని గెలుచుకున్నాడు.

మీరాబాయి లాగే ఇతను కూడా మణిపూర్‌కు చెందినవాడే.

కామన్వెల్త్ క్రీడలు నాలుగో రోజు ముగిసే సమయానికి భారత్ ఖాతాలో మూడు పతకాలు చేరాయి.

అంతకుముందు శుక్రవారం ఝండూ కుమార్ పారా-పవర్‌లిఫ్టింగ్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.

మరోవైపు బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్‌కు కూడా పతకం ఖాయమైంది.

డ్రా ద్వారా నేరుగా సెమీఫైనల్స్‌లోకి ప్రవేశించి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది.

కామన్వెల్త్ గేమ్స్ 2026 అధికారిక వెబ్‌సైట్ ప్రకారం వెయిట్‌లిఫ్టర్ రిషికాంత్ సింగ్ స్నాచ్ ఈవెంట్‌లో 121 కేజీలు ఎత్తి కొత్త గేమ్స్ రికార్డు సృష్టించాడు.

ఆ తర్వాత క్లీన్ అండ్ జర్క్‌లో 143 కిలోగ్రాములు ఎత్తాడు. మొత్తం 264 కిలోల బరువు ఎత్తి రజత పతకం సాధించాడు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)