ఫొటో సోర్స్, Sajjad HUSSAIN / AFP via Getty Images
ఫొటో క్యాప్షన్, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం.. జంతర మంతర్ వద్ద నిరసనల్లో పాల్గొన్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు.
ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు
"ప్రభుత్వం మన డిమాండ్లు అన్నింటినీ అంగీకరించింది. దీక్ష ముగిసింది, నిరసనకారులు క్షేమంగా ఇళ్లకు వెళ్లాలి" అని కాక్రోచ్ జనతా పార్టీ విజ్ఞప్తి చేసింది.
కాన్స్టిట్యూషన్ క్లబ్లో మూడో విడత జరిగిన చర్చల అనంతరం, కేంద్ర మంత్రులతో కలిసి సీజేపీ ప్రతినిధులు సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం తమ మిగిలిన డిమాండ్లను అంగీకరించిందని వారు చెప్పారు.
దీక్ష ముగిసిందని, అందరూ క్షేమంగా ఇళ్లకు వెళ్లాలని తమ మద్దతుదారులకు విజ్ఞప్తి చేశారు.
ఫొటో సోర్స్, Sajjad HUSSAIN / AFP via Getty Images
ఫొటో క్యాప్షన్, ఇతర విద్యార్థులతో కలిసి కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజిత్ దీప్కే వేదికపై సంబరాలు
ఫొటో సోర్స్, Sajjad HUSSAIN / AFP via Getty Images
ఫొటో క్యాప్షన్, తన రాజీనామా లేఖను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సమర్పించినట్లు ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.
ఫొటో సోర్స్, AFP via Getty Images
ఫొటో క్యాప్షన్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కోరుతూ గత కొన్ని రోజులుగా వేలాది మంది విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్నారు.
ఫొటో సోర్స్, Ritesh Shukla/Getty Images
ఫొటో క్యాప్షన్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత డప్పు వాయించి తన ఆనందాన్ని వ్యక్తం చేసిన యువతి. నిరసన చేపట్టిన యువత ప్రధాన డిమాండ్లలో ధర్మేంద్ర ప్రధాన రాజీనామా ఒకటి.
ఫొటో సోర్స్, Arun SANKAR / AFP via Getty Images
ఫొటో క్యాప్షన్, ‘‘కాక్రోచెస్ గెలిచారు, డెమొక్రసీ గెలిచింది’’ అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో సీజేపీ పోస్ట్ చేసింది.
ఫొటో సోర్స్, Arun SANKAR / AFP via Getty Images
ఫొటో క్యాప్షన్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత జంతర్ మంతర్ వద్ద యువత పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.
ఫొటో సోర్స్, Sonam Wangchuk/X
ఫొటో క్యాప్షన్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ప్రజాస్వామ్యం సాధించిన విజయంగా సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ అభివర్ణించారు.