ఫ్యాటీ లివర్ ఉన్నవారు మద్యం పూర్తిగా మానేయాలా? ఎన్నో ప్రశ్నలు - సమాధానాలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రియాంక ధీమన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 9 నిమిషాలు
మనలో చాలామందికి లివర్ (కాలేయం) గురించి చాలా తక్కువగా తెలుసు. కానీ, ఇది మన ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషించే అత్యంత ముఖ్యమైన అవయవం.
అయితే, లివర్‌లో ఏదైనా సమస్య వచ్చినప్పుడే సాధారణంగా మనం దానిపై శ్రద్ధ పెడుతుంటాం.
ఈ స్టోరీలో లివర్‌కు సంబంధించిన వ్యాధులు, వాటి లక్షణాలు, నివారణోపాయాల గురించి తెలుసుకుందాం.
ఈ విషయాలపై ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, హెపటాలజిస్ట్ డాక్టర్ అజయ్ కుమార్‌తో చర్చించాం.
ఆయన దిల్లీలోని బిఎల్కే మాక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ డిసీజెస్ సంస్థ చైర్మన్, హెచ్ఓడీగా సేవలందిస్తున్నారు.


సమాధానం: ఫ్యాటీ లివర్ అంటే కాలేయంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం. దేశంలో ఈ సమస్య నిరంతరం పెరుగుతోంది. 1980 వరకు ఫ్యాటీ లివర్ అనగానే మద్యం సేవించడం వల్లే లివర్ పాడైందని అనుకునేవాళ్లం. కానీ, మద్యం తాగని వారిలో కూడా కాలేయంలో కొవ్వు చేరుతుందని, అది కాలేయం కణాలను దెబ్బతీస్తుందని ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా గుర్తించారు. దీనివల్ల కాలేయం వాపునకు గురవ్వడం, క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
దురదృష్టవశాత్తూ, గత 10 ఏళ్లలో ఈ సమస్య విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు భారతదేశాన్ని మధుమేహం రాజధానిగా పిలిచేవాళ్లం, కానీ ఇప్పుడు ఫ్యాటీ లివర్ సమస్య అంతకంటే ఎక్కువగా ఉంది. ప్రస్తుత అంచనాల ప్రకారం దేశంలో దాదాపు 12 కోట్ల మంది ఫ్యాటీ లివర్ రోగులు ఉన్నారు. డయాబెటిస్, హై కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్, ఊబకాయం వంటి సమస్యలు కూడా ఫ్యాటీ లివర్‌కు ప్రధాన కారణాలు.


సమాధానం: మద్యం వల్ల లివర్ దెబ్బతింటుందనేది ముమ్మాటికీ నిజం. ఇప్పటికే ఉన్న మద్యం అలవాటు సమస్య ఇంకా పరిష్కారం కాకముందే, ఇప్పుడు మరో కొత్త సమస్య వచ్చింది. పెద్ద సంఖ్యలో యువత ఫ్యాటీ లివర్ బారిన పడుతున్నారు. ఇది భవిష్యత్తులో కాలేయానికి సంబంధించిన మరిన్ని తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది. కొన్ని కేసుల్లో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సిన పరిస్థితి కూడా వస్తోంది.
ఇది అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన ఆరోగ్య సమస్య. దీనిపై అటు సమాజం అప్రమత్తం కావాలి, ఇటు ప్రభుత్వం కూడా తగిన విధానాలను రూపొందించాల్సి ఉంది.

సమాధానం: ప్రారంభ దశలో దీని లక్షణాలు అస్సలు బయటపడవు. వ్యాధి ముదిరిన తర్వాతే సమస్య ఎక్కువగా తెలుస్తుంది. అయితే, రెగ్యులర్ స్క్రీనింగ్ పరీక్షల ద్వారా దీనిని ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు. కొన్నిరకాల రక్త పరీక్షల ద్వారా ఈ స్క్రీనింగ్ చేస్తారు. కాలేయంలో కొవ్వు ఎక్కువగా ఉందా లేదా ఫైబ్రోసిస్ సమస్య ఏమైనా ఉందా అనేది తెలుసుకోవడానికి ఫైబ్రో స్కాన్, ఎలాస్టోగ్రఫీ వంటి మరికొన్ని పరీక్షలు ఉపయోగపడతాయి.
కాలేయ పనితీరును తెలిపే లివర్ ఫంక్షన్ పరీక్షల్లో ఎస్జీఓటీ (ఎస్జీఓటీ), ఎస్‌జీపీటీ (ఎస్‌జీపీటీ) విలువలు కొన్నిసార్లు ఎక్కువగా ఉంటాయి. దీనిని గుర్తించడానికి 'ఫిబ్-4' అనే మరో మంచి విధానం అందుబాటులో ఉంది. దీని కోసం ప్రత్యేకంగా ఎలాంటి పరీక్షలు చేయనవసరం లేదు. వ్యక్తి వయసు, ఎస్జీఓటీ, ఎస్‌జీపీటీ విలువల ఆధారంగా ప్లేట్లెట్స్ సంఖ్యను లెక్కగడతారు. ఈ స్కోరు పరిమితి కంటే ఎక్కువగా ఉందని అనుమానం వస్తే, అప్పుడు మిగిలిన పరీక్షలు చేయిస్తారు.

సమాధానం: అన్నింటికంటే ముందు దీని బారిన పడకుండా ఎలా జాగ్రత్తపడాలో చూడాలి. ఫ్యాటీ లివర్ రాకుండా ఉండటానికి మన జీవనశైలిని మెరుగుపరుచుకోవడం అత్యంత ఉత్తమమైన మార్గం. ఇందులో సరైన ఆహారం, వ్యాయామం కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి కాకుండా, మద్యం సేవించడం దీనికి తీవ్రమైన నష్టం కలిగిస్తుంది.
ఒకవేళ ఎవరికైనా ఫ్యాటీ లివర్ సమస్య వస్తే, దానిని నయం చేయడానికి వ్యాయామం చాలా అవసరం. రెండవది, ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ఎంతో ముఖ్యం. ఆహారంలో సంతృప్త కొవ్వులు(శాచురేటెడ్ ఫ్యాట్) ఎక్కువగా తీసుకోకూడదు. ప్రోటీన్లను పెంచాలి, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండాలి.
ఆహారంలో తీపి పదార్థాలు, కూల్ డ్రింక్స్ వంటి చక్కెరతో కూడిన పానీయాలు తీసుకోకూడదు. చాక్లెట్లు కూడా ఎక్కువగా తినడం వల్ల నష్టం జరుగుతుంది. రోజూవారీ భోజనంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను చేర్చుకోవాలి. ఇది కాకుండా, ఒకసారి ఫ్యాటీ లివర్ సమస్య వచ్చాక కొద్దిగా మద్యం తాగినా అది శరీరానికి పెద్ద ముప్పుగా మారుతుంది.
ఎవరికైనా ఫ్యాటీ లివర్ సమస్య ఉంటే, వారు మద్యానికి పూర్తిగా దూరంగా ఉండాలని నేను బలంగా చెప్తాను.

ఫొటో సోర్స్, Getty Images

సమాధానం: లివర్ ఎంతవరకు దెబ్బతిన్నదో తెలుసుకోవడానికి వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం. ఆ స్థాయిని బట్టే చికిత్స అందించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు కాలేయం గట్టిపడటం లేదా ఫైబ్రోసిస్ సమస్య ఉన్నప్పుడు, లివర్ శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది.
కానీ, అలాంటి తీవ్రమైన సమస్య ఏమీ లేకుండా, కేవలం కాలేయంలో కొవ్వు మాత్రమే ఉంటే, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారానే దీనిని నయం చేసుకోవచ్చు. అందుకోసం రోజూ వ్యాయామం చేయడం, మద్యపానానికి పూర్తిగా దూరంగా ఉండటం, ఆహార నియంత్రణ పాటించడం అవసరం.
వారంలో 5 రోజుల పాటు రోజుకు 45 నిమిషాల నుంచి 1 గంట వరకు వ్యాయామం చేయడం మంచిది. ఇందుకోసం మీరు బ్రిస్క్ వాక్ చేయవచ్చు. 10 నిమిషాలలో 1 కిలోమీటరు నడవడం దీనికి సరైన పద్ధతి. మీరు రోజూ 6 కిలోమీటర్ల వరకు నడవగలిగితే అది మీ ఆరోగ్యానికి ఎంతో ఉత్తమం.

ఫొటో సోర్స్, Getty Images

సమాధానం: ఈ రెండింటికీ మధ్య చాలా పెద్ద సంబంధం ఉంది. డయాబెటిస్ ఉన్న రోగులకు ఫ్యాటీ లివర్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. ఒకవేళ డయాబెటిస్ ఉన్న వ్యక్తికి ఫ్యాటీ లివర్ వస్తే, అన్నింటికంటే ముందు వారి డయాబెటిస్‌ను అదుపులోకి తీసుకురావడం ఎంతో అవసరం.
భారతదేశాన్ని మధుమేహం (డయాబెటిస్) ప్రపంచ రాజధాని అని ఒకప్పుడు ఎలా అనేవాళ్లమో, ఇప్పుడు ఫ్యాటీ లివర్ ప్రపంచ రాజధాని అని అనాల్సి వస్తోంది. ఇటీవల 'ది లాన్సెట్' జర్నల్‌లో ఒక అధ్యయనం ప్రచురితమైంది, అందులో డయాబెటిస్ రోగులకు ఫైబ్రో స్కాన్ పరీక్షలు చేశారు. ఆ అధ్యయనంలో చాలా ఆందోళనకరమైన గణాంకాలు వెల్లడయ్యాయి. డయాబెటిస్ ఉన్న వారిలో దాదాపు 60 నుంచి 70 శాతం మంది ఫ్యాటీ లివర్ సమస్యతో కూడా బాధపడుతున్నట్లు అందులో తేలింది.

సమాధానం: బ్లాక్ కాఫీ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని, ఇది ఫ్యాటీ లివర్‌ను నయం చేయడంలో సహాయపడుతుందని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. అయితే, రోజుకు గరిష్టంగా రెండు కప్పులు తీసుకోవడం మాత్రమే సరైనది, అంతకంటే ఎక్కువ తీసుకుంటే శరీరంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.
ప్రముఖ హెపటాలజిస్ట్ డాక్టర్ సంజీవ్ చోప్రా దీనిపై ఒక పుస్తకం కూడా రాశారు. కాలేయ ఆరోగ్యానికి కాఫీ వల్ల కలిగే ప్రయోజనాలను అందులో వివరించారు.

సమాధానం: ఫ్యాటీ లివర్ అనేది మెటబాలిక్ సిండ్రోమ్‌లో ఒక భాగం. దీనితో రక్తపోటు (బ్లడ్ ప్రెజర్), కొలెస్ట్రాల్, లిపిడ్స్ వంటి సమస్యలు ముడిపడి ఉన్నాయి. ఈ వ్యాధులు ఉన్న రోగుల మరణాలకు ప్రధాన కారణం గుండె జబ్బులే అవుతున్నాయి. అంతేకాకుండా, ఇలాంటి రోగులలో క్యాన్సర్ వచ్చే ముప్పు కూడా ఎక్కువగా ఉంటుంది.
కాలేయ వ్యాధి బాగా ముదిరిన దశలో ఫ్యాటీ లివర్ ఉన్నట్లు గుర్తించిన వారిలో, ఆ కాలేయ సమస్య వల్లే మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని అనుకుంటాం. కానీ, మొత్తంగా చూస్తే వీరికి గుండె జబ్బుల ముప్పు (కార్డియాక్ రిస్క్) కూడా పెరుగుతుంది.
అందుకే లివర్ సమస్యతో పాటు డయాబెటిస్ కూడా ఉన్న రోగులకు గుండె పరీక్షలతో సహా అన్ని రకాల వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయించాలని మేం సిఫార్సు చేస్తాం.

ఫొటో సోర్స్, Getty Images

సమాధానం: లివర్ క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణాలు హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వైరస్లు. ఇవి లివర్ సిరోసిస్ (కాలేయం పూర్తిగా దెబ్బతినడం) వ్యాధికి దారితీస్తాయి. అయితే, ఈ వైరస్లు శరీరంలో సుదీర్ఘకాలం పాటు ఉన్నవారికి సిరోసిస్ సమస్య లేకపోయినా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ, హెపటైటిస్ బి, సి లేదా ఫ్యాటీ లివర్... కారణం ఏదైనప్పటికీ లివర్ సిరోసిస్ రావడమే క్యాన్సర్‌కు ముఖ్య కారణం.
గత 10 ఏళ్లలో లివర్ క్యాన్సర్ చికిత్స చాలా ఆధునికమైంది. ఇందులో రెండు ప్రధాన అంశాలను పరిశీలిస్తారు. మొదటిది - రోగికి అంతర్గతంగా సిరోసిస్ సమస్య ఉందా లేదా అనేది చూస్తారు (చాలా మంది రోగులలో ఇది ఉంటుంది). రెండవది, క్యాన్సర్ ఏ దశలో (స్టేజ్) ఉంది?
క్యాన్సర్ వేరే ఇతర అవయవాలకు వ్యాపించకుండా కేవలం కాలేయంలోనే ఉంటే, దాని పరిమాణాన్ని బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటారు. అలాగే అది రక్తనాళాలకు పాకిందా లేదా అనేది కూడా పరీక్షిస్తారు.
ఇలాంటి పరిస్థితుల్లో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అత్యుత్తమ చికిత్స. కొందరు రోగులలో క్యాన్సర్ ఉన్న భాగాన్ని మాత్రమే సర్జరీ ద్వారా తొలగించే అవకాశం ఉంటుంది. కానీ, సిరోసిస్ వల్ల కాలేయం పనితీరు ఎక్కువగా దెబ్బతింటే మాత్రం లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఉత్తమ మార్గం. దీని ఫలితాలు కూడా చాలా బాగుంటాయి. అయితే, ఇక్కడ ప్రధాన సమస్య ఏమిటంటే... చాలామంది రోగులు వ్యాధి ముదిరిన దశలో అంటే క్యాన్సర్ చుట్టుపక్కల ఉన్న రక్తనాళాలకు లేదా శరీరంలోని ఇతర భాగాలకు పాకిన తర్వాతే వైద్యుల దగ్గరకు వస్తుంటారు. అప్పుడే ఇబ్బంది అవుతుంది.

సమాధానం: లివర్ క్యాన్సర్ చికిత్స ఖర్చు అనేది అది ఏ దశలో ఉందనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి వస్తే దానికి భారీగా ఖర్చవుతుంది. సాధారణంగా 18 -20 లక్షల నుంచి మొదలై 30 - 40 లక్షల రూపాయల వరకు ఖర్చు కావొచ్చు.

సమాధానం: లివర్ దెబ్బతినడానికి ప్రధాన కారణం మద్యం. అలాగే ఏ, బీ, సీ, ఇ అనే నాలుగు ముఖ్యమైన వైరస్లు కూడా కారణమవుతాయి. వీటిలో హెపటైటిస్ ఏ, ఇ వైరస్లు దీర్ఘకాలం పాటు కాలేయానికి నష్టం కలిగించవు. కానీ, హెపటైటిస్ బీ, సీ వైరస్లు మాత్రం చాలాకాలం పాటు శరీరంలో ఉంటూ నష్టం చేస్తాయి.
అదృష్టవశాత్తూ 10 ఏళ్ల కిందటే మనకు అత్యంత సమర్థవంతమైన మందులు అందుబాటులోకి వచ్చాయి. ఈ మందులను రోగులకు 3 నెలల పాటు ఇవ్వడం ద్వారా 90 శాతం కంటే ఎక్కువ మంది శరీరాల నుంచి హెపటైటిస్-సి వైరస్‌ను పూర్తిగా నిర్మూలించవచ్చు. కాలక్రమేణా వచ్చిన మార్పులను గమనిస్తే, ఇప్పుడు హెపటైటిస్-సి కేసులు చాలా వరకు తగ్గాయి. ఇక హెపటైటిస్-బి నివారణకు చాలా మంచి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. అందుకే నవజాత శిశువులందరికీ ఈ వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం కూడా సిఫార్సు చేస్తోంది. ఒకవేళ హెపటైటిస్-బి బారిన పడిన వారికైనా సరే, ప్రస్తుతం చాలా మంచి మందులు అందుబాటులో ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

సమాధానం: మన శరీరంలో లివర్ ఒక్కటే ఉంటుంది. ఉదాహరణకు మనకు కిడ్నీలు రెండు, ఊపిరితిత్తులు రెండు ఉంటాయి కాబట్టి వాటిలో ఒకటి పాడైనా పని నడుస్తుంది. కానీ, లివర్ పాడైతే మాత్రం అనేక శారీరక సమస్యలు ఎదురవుతాయి.
లివర్ శరీరంలో ఎన్నో పనులను నిర్వహిస్తుంది. ఇది శరీరానికి అవసరమైన శక్తిని భద్రపరిచే ఒక పెద్ద 'స్టోరేజ్ హౌస్' లాంటిది. మన శరీరంలోని గ్లూకోజ్ నిల్వలన్నీ లివర్లోనే దాగి ఉంటాయి. అంతేకాకుండా, శరీరానికి అవసరమైన ఎన్నో రకాల పదార్థాలను తయారుచేసే ఒక 'ఫ్యాక్టరీ'లా ఇది పనిచేస్తుంది. చివరికి మన శరీరంలో పేరుకుపోయే వ్యర్థాలను బయటకు పంపడంలో కూడా ఇది ఎంతగానో సహాయపడుతుంది.

సమాధానం: కాలేయ సంబంధిత వ్యాధుల బారిన పడకుండా ఉండటానికి అన్నింటికంటే ముఖ్యమైనది జీవనశైలి. అందుకోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మద్యపానానికి దూరంగా ఉండటం, ఎలాంటి మాదకద్రవ్యాల జోలికి వెళ్లకుండా ఉండటం ఎంతో అవసరం. ఎందుకంటే, మత్తుపదార్థాలు తీసుకునే వారిలో హెపటైటిస్ వైరస్లు చాలా త్వరగా ప్రవేశిస్తాయని తేలింది.
నూనెలో వేయించిన పదార్థాలు, జంక్ ఫుడ్ వంటివి తినకూడదు. సమతుల్య ఆహారాన్ని సరైన సమయానికి తీసుకోవడం అత్యంత ముఖ్యం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























