ఫ్రాన్స్, స్పెయిన్‌లో అడవులు, ఆవాసాలను కాల్చి బూడిద చేస్తున్న కార్చిచ్చు, 11 ఫోటోల్లో..

ఫొటో సోర్స్, EPA
ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల్లో కార్చిచ్చు తో మూడు లక్షలమందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించారు.
ఫ్రాన్స్ నైరుతి ప్రాంతంలో మంటలు అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.


ఫొటో సోర్స్, Getty Images
అధిక ఉష్ణోగ్రతలు, బలమైన గాలుల వల్ల మంటలను అదుపుచేయడం కష్టంగా మారింది. స్పెయిన్‌లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. రానున్న రోజులు మరింత క్లిషంగా ఉంటాయని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ హెచ్చరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫ్రాన్స్‌లోని గిరోండ్, లాండెస్ ప్రాంతాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించిన ప్రజల సంఖ్య రెండున్నర లక్షలకు చేరుకుంది. కార్చిచ్చుకు సుడిగాలులు తోడవడంతో వాటిని అదుపుచేయడం చాలా కష్టంగా ఉందని అగ్నిమాపక అధికారులు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Reuters
ఇంటికి సమీపంలోనే మంటలు మొదలు కావడంతో కొందరు స్థానికులు ఫైర్ ఫైటర్లు రాకముందే వాటిని ఆర్పేందుకు తమవంతు ప్రయత్నాలు చేశారు. ఇటు ఫ్రాన్స్ లోనూ, అటు స్పెయిన్ లోనూ ఇలాంటి దృశ్యాలు కనిపించాయి.
ఈ చిత్రంలో ఇద్దరు స్పానిష్ మహిళలు మంటలు ఆర్పేందుకు చిన్న డ్రమ్ములో నీళ్లు తీసుకెళుతూ కనిపించారు.

ఫొటో సోర్స్, Getty Images
కార్చిచ్చును అదుపుచేసేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది. అగ్నిమాపక సిబ్బందికి సహాయంగా అడవుల్లో పొదలు తొలగించడం, మంటలు వ్యాపించకుండా ఫైర్ బ్రేక్స్ ఏర్పాటుచేయడం వంటి పనుల్లో సైన్యం సేవలందిస్తోంది.

ఫొటో సోర్స్, Reuters
కార్చిచ్చు నుంచి వచ్చిన పొగ బలమైన గాలులతో కలిసి బోర్డో నగరాన్ని కమ్మేసింది. పొగను పీల్చగానే నేరుగా ఊపిరితిత్తులపై ప్రభావం పడుతోందని బ్రిటిష్ పర్యటకులు చెప్పారు. ఇది దేశచరిత్రలో ఎన్నడూ లేనంత తీవ్రమైన సంక్షోభం అని ఫ్రాన్స్ ప్రభుత్వం తెలిపింది.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో సోర్స్, Getty Images
స్పెయిన్‌లో కార్చిచ్చులు మొదలైనప్పటి నుంచి మాడ్రిడ్, అవిలా ప్రాంతాల నుంచి దాదాపు 60వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఏడాది ఇప్పటివరకు 1.3లక్షల హెక్టార్ల భూమి కార్చిచ్చు వల్ల దగ్ధమైంది.

ఫొటో సోర్స్, Getty Images
కార్చిచ్చును అదుపులోకి తెచ్చేందుకు వాతావరణ పరిస్థితులు ఏ మాత్రం సహకరించడం లేదని స్పెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఫెర్నాండో గ్రాండే-మార్లాస్కా తెలిపారు. మాడ్రిడ్, అవిలాలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆదేశించారు.

ఫొటో సోర్స్, Getty Images
స్పెయిన్ చరిత్రలో కూడా ఇది అత్యంత భయంకరమైన కార్చిచ్చని స్థానిక నేతలు చెబుతున్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























